Gossips" మణికర్ణికా " (ది క్వీన్ అఫ్ ఝాన్సీ) ఆఫీషియల్ ట్రైలర్.....

” మణికర్ణికా ” (ది క్వీన్ అఫ్ ఝాన్సీ) ఆఫీషియల్ ట్రైలర్.. మరో బాహుబలి పక్కా..!

మణికర్ణిక ట్రైలర్.. మరో బాహుబలి పక్కా..!

ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్రతో తెలుగు దర్శకుడు క్రిష్, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ మణికర్ణిక. క్రిష్ డైరక్షన్ లో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సినిమా టీజర్, ట్రైలర్ లో మాత్రం కంగనా క్రిష్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. సినిమా దర్శకుడిగా రధాకృష్ణ జాగర్లముడితో పాటుగా కంగనా తన పేరు వేసుకుంది.

జీ స్టూడియోస్ నిర్మిస్తున్న మణికర్ణిక ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే మరో బాహుబలి సినిమాగా అనిపిస్తుంది. ఝాన్సీ లక్ష్మీ భాయ్ వీరోచిత పోరాట పటిమను అదే విధంగా కంగనా హావభావాల్లో చూపించింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మణికర్ణిక ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 2019 జనవరి 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయం మీద క్లారిటీ రాలేదు. విజువల్స్ చూస్తే క్రిష్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపాడని తెలుస్తుంది. భారీ సెట్లు ఆ హుందాతనం ప్రేక్షకులకు మరోసారి బాహుబలిని గుర్తుచేశారు. ట్రైలర్ లానే సినిమా కూడా ఆడియెన్స్ ను అబ్బురపరచేలా ఉంటే మణికర్ణిక మరో సంచలనంగా మారుతుందని అంటున్నారు. కంగనా హోల్ అండ్ సోల్ గా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించేలా కనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news