క్రేజీ డైరెక్టర్ తో మంచు విష్ణు నెక్ట్స్ ప్రాజెక్ట్..!

145

టాలీవుడ్ లో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా పరిచయం అయ్యారు. ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైగా అవుతున్నా సరైన హిట్ మాత్రం ఇద్దరికీ దక్కలేదు. అంతే కాదు ఈ మద్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఇక సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. తనకి బాగా అచ్చొచ్చిన యాక్షన్ కామెడీని నమ్ముకున్నా ఆయనకి కలిసి రాలేదు.

గతంలో తనకు ‘ఢీ’లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన శ్రీను వైట్లతో వుండనుందనే విషయాన్ని విష్ణు స్వయంగా చెప్పాడు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, తదనంతరం మీడియాతో మాట్లాడుతూ దాదాపు 12 ఏళ్ల తర్వాత తాను శ్రీను వైట్లతో సినిమా చేయనున్నానని అన్నాడు.

12 యేళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఢీ’ .. భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మంచి ఎంట్రటైన్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని అంటున్నాడు విష్ణు. గత కొంత కాలంగా దర్శకుడిగా శ్రీను వైట్ల కూడా ఒక్క సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మంచ హిట్ కొడతారా లేదా అనేది చూడాలి.

Leave a comment