Gossipsమనోజ్ ప్రణతిల విడాకుల వివాదం...?

మనోజ్ ప్రణతిల విడాకుల వివాదం…?

మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో మనోజ్ కెరియర్ లో బాగా వెనుకపడ్డాడు. మంచు విష్ణు సినిమా అయినా ఫలితంతో సంబంధం లేకుండా అలరిస్తున్నాయి కాని మనోజ్ సినిమాలు ఎలా వస్తున్నాయో అలా వెళ్తున్నాయి. ఇక ఇవి చాలదు అన్నట్టు మనోజ్ పర్సనల్ లైఫ్ కూడా డిస్టబెన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

తన భార్య ప్రణతి నుండి మనోజ్ విడిపోవాలని ఫిక్స్ అయ్యాడని.. కొన్నాళ్లుగా వారు విడిగా ఉంటున్నారని తెలుస్తుంది. మోహన్ బాబు ఇద్దరిని కలపాలని ప్రయత్నించినా లాభం లేదని తెలుస్తుంది. అందుకే మనోజ్, ప్రణతి రెడ్డిలు విడిపోవాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ రూమర్స్ కు చెక్ పెట్టేలా మనోజ్ తన భార్యతో దిగిన పిక్ ఒకటి ట్విట్టర్ లో షేర్ చేశాడు.

మరి రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నమో లేక ఆ ప్రాసెస్ లో ఉందని చెబుతున్నాడో మాత్రం అర్ధం కాలేదు. కెరియర్ పరంగా స్ట్రాంగ్ గా ఉంటే ఈ ఇబ్బందులు పెద్దగా ఎఫెక్ట్ చూపించేవి కావు ప్రస్తుతం మనోజ్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news