ఆంటీ మోజులో అబ్బాయి.. పెళ్లికి సిద్ధం..!

122

బాలీవుడ్ లో మరో ప్రేమ వివాహం జరుగబోతుంది. అయితే ఇది అలాంటిలాంటి ప్రేమ కాదు ఆంటీకి అబ్బాయికి మధ్య ఏర్పడిన ప్రేమ. 45 ఏళ్ల మలైకా అరోరా.. 33 ఏళ్ల అర్జున్ కపూర్ ను పెళ్లాడబోతుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సీక్రెట్ ఎఫైర్ నడిపించిన ఈ ఇద్దరు ఇప్పుడు పెళ్లితో ఒకటి కానున్నారు. సల్మాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ నుండి విడిపోయాక అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది మలైకా అరోరా. బాలీవుడ్ మీడియా వీరిద్దరి గురించి ఎప్పుడు ఫోకస్ చేస్తూనే వచ్చింది.

ఫైనల్ గా ఈ ఇద్దరు ఏప్రిల్ 19న ఒకటి కానున్నారట. చర్చిలో వీరి వివాహం జరుగుతుద్నని తెలుస్తుంది. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని చెప్పడానికి ఇదో ఉదహరణగా చెప్పుకోవచ్చు. తనకన్నా 12 ఏళ్ల చిన్న వాడితో మలైకా రెండో వివాహం జరుగనుంది. కొన్నాళ్లుగా వీరు సహ జీవనం చేస్తుండగా ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత అఫిషియల్ గా కలిసి ఉంటారన్నమాట.

అర్జున్ కపూర్, మలైకా పెళ్లి మ్యాటర్ పై బాలీవుడ్ సెలబ్రిటీస్ నోరు విప్పట్లేదు. ఎవరేం అనుకున్నా తమ బంధం మాత్రం చాలా గొప్పదని.. పెళ్లితో దానికో అర్ధం వచ్చేలా చేసేందుకు సిద్ధమయ్యారు అర్జున్ కపూర్, మలైకా అరోరా.
malaika-arjun1553693171

Leave a comment