Gossipsవరుస ప్లాప్స్ తో మహేష్... రెమ్యూనేషన్ లేకుండా మహేష్ నెక్స్ట్ మూవీ

వరుస ప్లాప్స్ తో మహేష్… రెమ్యూనేషన్ లేకుండా మహేష్ నెక్స్ట్ మూవీ

మహేష్ దూకుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన 14 రీల్స్ వారు ఆ సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాత మహేష్ తో తీసిన 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలు నిరాశ కలిగించాయి. ఆగడు టైంలోనే మహేష్ వారికి మరో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడట. ఇక స్టార్స్ తో వదిలేసి కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన 14 రీల్స్ బ్యానర్ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఓకే అనిపించినా ఆ తర్వాత వచ్చిన లై ఘోర పరాజయం పొందింది.

అందుకే మళ్లీ మహేష్ సినిమాతోనే వారు హిట్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ డివివి దానయ్య నిర్మాణంలో భరత్ అను నేను, అశ్వనిదత్, దిల్ రాజు కలిసి చేస్తున్న వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత చేసే త్రివిక్రం సినిమాకు ఎలాగు రాధాకృష్ణ నిర్మాతగా ఉంటాడు.

మహేష్ సినిమా అంటే మరో రెండేళ్లు ఆగక తప్పదు ఇక ఓ యువ డైరక్టర్ తో మహేష్ సినిమా చేయాలని చూస్తున్నారట 14 రీల్స్. ఇప్పటికే మహేష్ కు కథ చెప్పించారట. మహేష్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. మొత్తానికి నిర్మాతల బాగు కోరే హీరోగా మహేష్ మరోసారి మనసులను గెలిచాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news