Gossipsసుకుమార్ తో సినిమా వద్దని షాకిచ్చిన మహేష్..!

సుకుమార్ తో సినిమా వద్దని షాకిచ్చిన మహేష్..!

భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న మహర్షి సినిమాపై సెట్స్ మీద ఉంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ మహేష్ తో 1 నేనొక్కడినే సినిమా చేసిన సుకుమార్ ఈసారి ఆ సినిమాలా కాకుండా పకడ్బందీ స్క్రిప్ట్ తో వస్తున్నాడట.

ఇక ఈ సినిమా కథ స్వాతంత్రం వచ్చిన కొత్తలో తెలంగాణా ప్రాంతాన్ని రజకారులు ఎలా పాలించారన్న కాన్సెప్ట్ తో రాసుకున్నాడట. అయితే ఇదేదో కాంట్రవర్సీ అవుతుందని మహేష్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ మళ్లీ పిరియాడికల్ డ్రామా చేయాలని చూస్తున్నాడు.

అయితే మహేష్ మాత్రం దానికి నో చెప్పాడట. అందుకే వేరే కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news