Gossipsమహేష్ టైటిల్ పై రగడ...

మహేష్ టైటిల్ పై రగడ…

కొరటాల శివ డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ గా భరత్ అను నేను ఫిక్స్ చేశారు. అసలు ఆ సినిమా టైటిల్ ఇదే అని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయకున్నా శ్రీమంతుడు తర్వాత శివ మహేష్ కాంబో భరత్ అను నేను అంటూ మీడియా హడావిడి చేస్తుంది. అయితే ఈ హడావిడికి షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ.

మహేష్ సినిమా టైటిల్ ఇప్పటిదాకా వినపడుతున్న భరత్ అను నేను బోర్ కొట్టేయడంతో సినిమా టైటిల్ అది కాకుండా వేరేది పెట్టాలని డిసైడ్ అయ్యాడట. అందుకే సినిమా రిలీజ్ డేట్ గా ఎనౌన్స్ చేసిన రెండు పోస్టర్ లో ప్రొడక్షన్ నెంబర్ వేసారు కాని సినిమా టైటిల్ కన్ఫాం చేయలేదు. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడని తెలిసిందే.

అందుకే భరత్ అను నేను అంటూ పెడదామని అనుకున్నారు.. కాని మీడియా సర్కిల్స్ లో ఆ పేరు బాగా వినిపించడంతో అది పాత టైటిల్ గా కొడుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నారట. ఇదవరకు స్పైడర్ విషయంలో కూడా మహేష్ ఇలా టైటిల్ నాన్చడం వల్ల పెద్ద నష్టమే జరిగింది. మరి ఇప్పుడైనా జాగ్రత్తపడితే మంచిది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news