నంది అవార్డులపై ‘కత్తి’ పోట్లు..

mahesh kathi

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై బాధ ఉన్నవారు నిజంగా ఇప్పటివరకు బయటపడలేదు. కానీ దీనిమీద మాత్రం ఎవరెవరో స్పందిస్తూ మరింత వివాదాస్పదం చేసేస్తున్నారు. అవార్డులను ప్రభుత్వం ప్రకటించిందో లేదో అప్పుడే వాటి చుట్టూ ఎన్నో ఎన్నెన్నో వివాదాలు చుట్టుముట్టేశాయి.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నంది అవార్డులకు సంబంధించిన విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి. తెలుగు చలన చిత్రానికి సంబంధించి ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు.

అవార్డులకు ఎంపికైన వారే.. అవార్డుల కమిటీకి మెంబర్‌గా ఉండటం కన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదంటూ బాలకృష్ణపై పంచ్ వేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అందరూ స్పందిస్తున్నారు నేను స్పందించకపోతే బాగోదు అనుకున్నాడో ఏమో కానీ సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ తన స్పందన తెలియజేసి కాక రేపాడు.

లెజెండ్ ఒక అప్రజాస్వామిక ప్యూడల్ భావాల్ని, భావజాలాన్ని పెంపొందించే సినిమా ఆ సినిమాకు కూడా అవార్డు రావడంకంటే మరొక దారుణం ఉండదన్నారు. ఈ సినిమాలో బ్రూణ హత్యల సీనేదో ఉందట.. అందుకే ఇచ్చామని చెప్పుకుంటున్నారంటూ అయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఇప్పుడు నేనూ చంద్రబాబును పొగిడేస్తే నాకు నంది అవార్డు ఇస్తారోమో!? వ్యంగ్యంగా తన నిరసన తెలిపాడు కత్తి. అయితే ఇంకెంతమంది ఉన్నారో స్పందించడానికి ..? రండి ఇంకా లేటు ఎందుకు ..?

Leave a comment