Gossips'మా'కు ఈ టైంలో బారి దెబ్బేసిన మహేష్..!

‘మా’కు ఈ టైంలో బారి దెబ్బేసిన మహేష్..!

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో జరుగుతున్న గొడవలు గురించి తెలిసిందే. నిధులు దుర్వినియోగం చేశారంటూ కార్యదర్శి నరేష్.. శివాజి రాజా, శ్రీంకాత్ ల మీద ఫైర్ అవుతుంటే మరో పక్క తాము చిల్లి గవ్వ కూడా వాడుకోలేదని నిరూపిస్తే సొంత ఆస్తులను ఇచ్చేస్తామని అంటున్నాడు శివాజి రాజా. అధ్యక్షుడిగా శివాజి రాజా ఇన్నాళ్లు మంచి పేరు తెచ్చుకోగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఫారిన్ లో చిరంజీవి ఈవెంట్ తో అసలు రచ్చ మొదలైంది.
5

7
2 కోట్ల కాంట్రాక్ట్ కాస్త 1 కోటికి వచ్చింది. అది కూడా దుర్వినియోగం చేశారని అంటున్నారు. ఇదిలాఉంటే త్వరలో ‘మా’ కు సపోర్ట్ ఇచ్చేందుకు మహేష్ బాబుతో యూఎస్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం ‘మా’ లో గొడవల కారణంగా ఈ ఈవెంట్ కు తాను వెళ్లడం కరెక్ట్ కాదని భావిస్తున్నాడట మహేష్. ముందు మా అసోశియేషన్ లో బయటపడ్డ గొడవలు సర్ధుమనిగాకే తాను వెళ్లే అవకాశం ఉందని అంటున్నాడట.
4

3
మహేష్ కు ఫారిన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ వస్తే కచ్చితంగా మా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయినట్టే. మరి మహేష్ వెళ్తాడా లేడా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
2

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news