‘మహర్షి’లో లీకైన టాప్ సీక్రెట్స్ ..

11

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అదిరిపోయే స్టైలిష్ లుక్‌లో మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నాడని ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో మహేష్ ఒక కాలేజీ స్టూడెంట్‌‌‌‌‌‌గా కనిపించాడు.

అయితే ఈ సినిమాలో మహేష్ అసలు పాత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మహేష్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్‌గా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడట. ప్రస్తుతం న్యూయార్క్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఎక్కువగా యూఎస్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఖాయం అని అంటున్నారు చిత్ర యూనిట్.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment