Gossipsసూపర్ స్టార్ బర్త్ డేకు.. భరత్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

సూపర్ స్టార్ బర్త్ డేకు.. భరత్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా నుండి ఓ క్రేజీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దాదాపు 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ ఎండ్ కార్డ్ లో హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ కృష్ణ అని వేశారు. సాహసమే ఊపిరిగా ఎలాంటి ప్రయోగాన్నైనా తానే ముందు ఉండి నడిపించిన నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ.

ఫస్ట్ జేమ్స్ బాండ్ ను తెలుగు తెరకు పరిచయం చేసి సూపర్ స్టార్ కృష్ణ సినిమా కలర్, స్కోప్ ఇలా అన్నిటిని తన సినిమాలతోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే కాదు పందెం కడితే తన సత్తా చూపిస్తూ గొప్ప గొప్ప సినిమాలను చేసి చూపించారు సూపర్ స్టార్. ఒకప్పుడు కృష్ణ గారితో సినిమా అంటే బాక్సాఫీస్ పై కలక్షన్ల వర్షమే అని చెప్పొచ్చు.

తాను ఎక్కడ ఉంటే అక్కడ కనీసం సెలవు రోజుల్లో విహార యాత్రకు వెళ్తే అక్కడ కూడా షూటింగ్ పెట్టుకునే వారంటే కృష్ణ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్. కృష్ణ లానే రొటీన్ కు భిన్నంగా కొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news