Gossipsహైదరాబాద్ లో ప్రత్యక్షమైన మహేష్ మైనపు బొమ్మ..!

హైదరాబాద్ లో ప్రత్యక్షమైన మహేష్ మైనపు బొమ్మ..!

సూపర్ స్టార్ మహేష్ వాక్స్ స్టాట్యూ మ్యూజియం ఏర్పాటు చేసిన మైనపు బొమ్మ ఈరోజు హైదరాబాద్ లోని ఏ.ఎం.బి సినిమాస్ లో ప్రదర్శనకు ఉంచారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన వాక్స్ స్టాట్యూ మ్యూజియం సింగపూర్ లో మహేష్ మైనపు బొమ్మ ఉంటుంది. ప్రభాస్ తర్వాత వాక్స్ స్టాట్యూలో స్థానం సంపాదించాడు మహేష్. మహేష్ కు వున్న వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే మహేష్ స్టాట్యూని ప్రదర్శనలో ఉంచడం జరుగుతుంది.

వాక్స్ స్టాట్యూ జెనరల్ మేనేజర్ తో పాటుగా కొంతమంది ప్రముఖుల సమక్షంలో మహేష్ స్టాట్యూని మహేష్ రివీల్ చేశారు. మహేష్ పక్కన స్టాట్యూ కూడా మహేష్ లానే మెరిసిపోతుంది. వాక్స్ స్టాట్యూ చరిత్రలో ఎప్పుడు లేనిది సింగపూర్ నుండి ఈ స్టాట్యూ ఇక్కడకు తీసుకురావడం జరిగింది. సింగపూర్ ఐఫా జోన్ లో మహేష్ మైనపు బొమ్మ ఉంచనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు మహర్షి సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news