మ‌హేష్‌బాబు ప‌ని ఖేల్ ఖ‌త‌మేనా… ఇరుక్కుపోయాడా..?

18

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇమేజ్ చట్రంలో ఇరుక్కు పోయాడా ? రొటీన్ స్టోరీల నుంచి బయటకు రాలేక పోతున్నాడు. ఒకప్పుడు ప్రాజెక్టులు చేస్తాడని స్టార్ హీరోలలో భిన్నమైన కథలను ఎంచుకుంటాడ‌న్న పేరున్న‌ మహేష్… ఇప్పుడు ఎందుకు పరమ రొటీన్ స్టోరీలు ఎంచుకుంటున్నాడో ? ఎవరికి అర్థం కావడం లేదు. మహేష్ బాబు నటించిన గత నాలుగైదు సినిమాలను ఒకసారి పరిశీలిస్తే శ్రీమంతుడు సినిమా గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. బ్రహ్మోత్సవంలో బంధువులు అంతా మన చుట్టూ ఉండాలి… మనం అందరం కలిసి ఉండాలన్న సందేశాన్ని తీసుకున్నాడు. ఈ సినిమాల కథలు చాలా సార్లు తెలుగు సినిమాల్లో చూసినవే.

ఇక భరత్ అనే నేను సినిమాలో రాజకీయాలు, సమాజం అనే రెండు అంశాలపై సందేశాన్ని మిక్స్ చేసి వదిలాడు. ఇక మహర్షిలో రైతుల సమస్యలపై సందేశం ఇచ్చాడు. స్పైడర్ సినిమాలో డైరెక్టర్ మురుగదాస్ ఏదో సందేశం ఇవ్వాలని అనుకున్న అది ఎవరికి అర్థం కాలేదు. ఇలా మహేష్ నాలుగైదు సినిమాలు చూస్తుంటే సందేశం… సందేశం అన్న మాటనే ఎక్కువగా హైలెట్ చేస్తూ వస్తున్నారు. వాస్తవంగా చూస్తే మహేష్ గత సినిమాల్లో ఉన్న క్రియేటివిటీ ఆయన చివరి నాలుగైదు సినిమాల్లో మిస్ అయిందనే చెప్పాలి.

ఇక మహేష్ స్టిల్స్‌తో పాటు ఎక్స్ప్రెషన్స్ విషయంలో కూడా ఒకే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. లుక్స్ విషయంలో ఉన్నంతలో గత నాలుగు సినిమాలతో పోలిస్తే మహర్షి ఒక్కటే కాస్త బెటర్ అనిపిస్తుంది. ఇక డైరెక్టర్లు ఎంపికలోనూ పరమ రొటీన్ కథ, కథనాలతో సినిమాలు తీసే డైరెక్టర్లని ఎంచుకున్నాడని… ఎలాగైనా హిట్ కొట్టాలని తలంపుతో ఇమేజ్ టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. వ‌న్ లాంటి వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకున్న మ‌హేష్‌కు ఆ సినిమా హిట్ కాక‌పోయినా ఎంతో మంచి పేరు తీసుకువ‌చ్చింది. మ‌రోవైపు ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ లాంటి హీరోలు డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుంటుంటే మ‌హేష్ కేవ‌లం హిట్ కొట్టాల‌న్న తాప‌త్ర‌యంతో రొటీన్ క‌థ‌ల‌కే ఓటేస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడున్న టైంలో మ‌ళ్లీ వంశీ పైడిప‌ల్లితోనే సినిమా చేయాల‌ని అనుకోవ‌డంలో ఆంత‌ర్యం ఏంటో ? ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. మ‌హేష్ ఇక‌నైనా క‌థ‌ల ఎంపిక‌లో మార‌తాడేమో ? చూడాలి.

Leave a comment