మహేష్ ని కూడా పట్టించుకోని ఫ్యాన్స్..

41

సూపర్ స్టార్ మహేష్ ఈమధ్య తన పంథా మార్చుకున్నాడు. ఇదవరకు చాలా రిజర్వెడ్ గా ఉండే మహేష్ అందరితో కలివిడిగా ఉంటుండగా తన సినిమా గురించి తప్ప మిగతా సినిమా విషయాలను పట్టించుకోని మహేష్ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా తనకు నచ్చితే దాని గురించి ట్వీట్ చేస్తున్నాడు. గీతా గోవిందం, కేరాఫ్ కంచరపాలెం సినిమాలకు మహేష్ ఇచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు.
2
ఇదిలాఉంటే తన బావ సుధీర్ సినిమాల పట్ల మహేష్ ట్వీట్స్ అంత ప్రభావం చూపించట్లేదు. సుధీర్ బాబు సమ్మోహనం సినిమాకు మహేష్ పాజిటివ్ గా ట్వీట్ వేసినా లాభం లేకుండా పోయింది. అయితే ఇటీవల సుధీర్ బాబు నటిస్తున్న నన్ను దోచుకుందువటే సినిమా ట్రైలర్ పై మహేష్ స్పీడ్ గా స్పందించాడు.
1
సుధీర్ సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు బాగున్నాయి. నిర్మాతగా మొదటి సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని విష్ చేశాడు. అయితే సుధీర్ బాబు మాత్రం సూపర్ స్టార్ సూపర్ విషెష్ కు తన ధన్యవాదాలు తెలిపాడు. సూపర్ స్టార్ విష్ సుధీర్ సినిమాను ఈసారైనా కాపాడుతాయా లేదా అన్నది చూడాలి.


41

Leave a comment