సందీప్ వంగాతో మహేష్ కి బేరం లేనట్టేనా..?

15

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త డైరెక్టర్ అయినా..బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సందీప్ వంగా. తొలి సినిమాతోనే టాలీవుడ్ కి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ని అందించాడు. మొదట ఈ సినిమా బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు వచ్చినా..స్టోరీ మాత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది..పెట్టిన పెట్టుబడికి అధికంగా లాభాలు వచ్చాయి.

ఆ మద్య సందీప్ వంగతో స్టార్ హీరోల సంప్రదింపులు కొనసాగుతున్నాయని..ఆ లీస్ట్ లో మహేష్ బాబు కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి.అంతే కాదు సందీప్ వంగ మంచి కథతో మహేష్ బాబు ని ఇంప్రెస్ చేశారని..ఆయన కూడా ఓకే చేశారని వార్తలు వచ్చాయి..త్వరలో వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని వార్తలు వచ్చాయి.

కానీ అలా జరగలేదు..మహేష్ బాబు వరుసగా వేరే దర్శకులతో కమిట్ అవుతున్నారు. గత సంవత్సరం కొరటాల, వంశి పైడిపల్లి లతో రెండు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈ లేక్కన సందీప్ వంగాతో ఇప్పట్లో మూవీ లేనట్లే అనిపిస్తుంది. దాంతో సందీప్ వంగాతో సినిమా లేనట్టేనని అంటున్నారు. మహేశ్ నుంచి కబురు రాకపోవడంతో కుదిరితే మరో హిందీ మూవీ .. లేదంటే మరో హీరోతో తెలుగు సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగా వున్నాడట.

Leave a comment