Movies‘ఖైదీ’, ‘శాతకర్ణి’లపై మహేష్ చేసిన ‘ట్రూలీ’ ట్వీట్స్.. అభిమానులారా ఇప్పుడైనా మారండి!

‘ఖైదీ’, ‘శాతకర్ణి’లపై మహేష్ చేసిన ‘ట్రూలీ’ ట్వీట్స్.. అభిమానులారా ఇప్పుడైనా మారండి!

Mahesh Babu tweeted on Khaidi No 150 and Gautamiputra Satakarni. He praises both of them for their vision, style and performances.

‘మా హీరో తోపు… లేదు మా హీరోనే గ్రేట్’ అని ఫ్యాన్స్ ఎప్పుడూ తన్నుకు చస్తుంటారు. కానీ.. హీరోలు అలా కాదు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్నేహభావంగానే మెలుగుతారు. తామంతా కలిసే ఉన్నామని, ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని ఎన్నోసార్లు చాలామంది చెప్పారు. ఈమధ్య అభిమానుల మధ్య గొడవలు మరీ పెచ్చుమీరిపోతుండడంతో.. తమ మధ్య బలమైన బంధం ఉందని ప్రతిఒక్కరూ స్పందిస్తూనే ఉన్నారు. ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలయ్యల ప్రతిష్టాత్మక సినిమాల మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ.. హీరోల మధ్య ఈగో ఏమాత్రం లేదని నిరూపించేశాడు.

ఇంతకీ మహేష్ ఏం చెప్పాడంటే.. ‘టాలీవుడ్‌లో విజయాల వర్షం కురుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన రెండు భారీ సినిమాలు చూసేందుకు తీరిక సమయం లభించిందని’ మొదలుపెట్టిన ఈ ప్రిన్స్.. తొలుత చిరు చిత్రంపై ట్వీట్స్ చేశాడు. ‘చిరంజీవిగారు.. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని మిస్ అవుతూ వస్తున్నాం.. వెల్‌కం బ్యాక్.. ‘ఖైదీ’ చిత్రం ఘనవిజయం సాధించినందుకు చిత్రబృందంకి కంగ్రాట్స్’ అని అన్నాడు. ఆ తర్వాత శాతకర్ణి గురించి ప్రస్తావిస్తూ.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో నటించిన బాలయ్యగారికి హ్యాట్సాఫ్. మీ పెర్పార్మెన్స్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే మైలురాయిగా నిలిచిపోతుంది. క్రిష్.. నీ విజన్, విశ్వాసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. టాలీవుడ్‌కి నిజంగా నువ్వు గర్వకారణం. నీకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

అభిమానులారా.. చూశారా! మహేష్‌లాగే ఎందరో హీరోలు చిరు, బాలయ్యల చిత్రాల మీద పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ మార్పు నిజంగా అభినందనీయం.. టాలీవుడ్‌కి మంచి పరిణామం. వీరిలాగే మీరూ (ఫ్యాన్స్) మారి, ఏకంగా ఉంటే.. మార్కెట్ పరంగా ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news