ఆ లెక్కలో మహేష్ నెంబర్ 1.. సూపర్ స్టార్ అంటే ఇది..!

mahesh-babu-no-1-in-twitter

స్టార్ హీరో అంటే సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం సినిమాల ఫలితం కాస్త ప్రభావితం చూపిస్తుంది. అయితే ఎన్ని ఫ్లాపులొచ్చినా సరే ఒక్క హిట్ తో మళ్లీ తిరిగి అదే క్రేజ్ తెచ్చుకుంటారు స్టార్స్.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సినిమా ఫలితాల పరంగా వెనుకపడి ఉన్నా ట్విట్టర్ ఫాలోవర్స్ లో మాత్రం టాలీవుడ్ కు ఏ హీరోకి లేని 6 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ సాధించాడు. హిట్లు పడకపోయినా సరే మహేష్ రేంజ్ ఇదని ట్విట్టర్ ఫాలోవర్స్ చూస్తే అర్ధమవుతుంది. సౌత్ లో క్రేజీ స్టార్స్ లో మహేష్ కూడా ఒకరు.

ప్రస్తుతం మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 20న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనగా ఏప్రిల్ 7న ఎల్బి స్టేడియం లో జరుగనుంది. ఈ వేడుకకు ఎన్.టి.ఆర్, రాం చరణ్ గెస్టులుగా వస్తున్నారని టాక్.

Leave a comment