మహేష్ కొత్త లుక్ టీజర్ అదిరిపోయింది.. మీ ఫ్యూచర్ కు మీరే సూపర్ స్టార్..!

mahesh babu new look

ఓ పక్క 25వ సినిమా బిజీలో ఉన్న మహేష్ గడ్డం లుక్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని అంచనాలు ఏర్పడగా ఈలోగా ఓ యాడ్ తో ఫ్యాన్స్ కు నిజంగానే సర్ ప్రైజ్ ఇచ్చాడు సూపర్ స్టార్. సాయి సూర్య డెవలపర్స్ యాడ్ లో సూపర్ స్టార్ సూపర్ ఎంట్రీ అదిరిపోయింది. రెగ్యులర్ గా మహేష్ కనిపించే లుక్ కు భిన్నంగా గడ్డంతో మహేష్ లుక్ అదిరిపోయింది.

ఇక మీ ఫ్యూచర్ కు మీరే సూపర్ స్టార్ అంటూ కంటెంట్ కూడా బాగానే ఎక్కేలా చేశాడు. సూపర్ స్టార్ తో చెప్పిస్తే అది ఇంకా బాగా జనాల్లోకి వెళ్తుందని సాయి సూర్య డెవలపర్స్ ఈ యాడ్ మహేష్ తో షూట్ చేశారు. ప్రస్తుతం డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ 25వ సినిమా అక్కడే లాంగ్ షెడ్యూల్ జరుపుకోనుంది.

దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Leave a comment