Moviesరిలీజ్‌కి ముందే చరిత్ర సృష్టించిన మహేష్-మురుగదాస్ సినిమా

రిలీజ్‌కి ముందే చరిత్ర సృష్టించిన మహేష్-మురుగదాస్ సినిమా

Prince Mahesh Babu and AR Murugadoss’s latest film satellite rights has been sold to record price which is history in south film industry.

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటేనే.. దాని రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది.. ఇద్దరూ స్టార్స్ ఓ ప్రాజెక్ట్ కోసం కలిస్తే ఇంకేమైనా ఉంటుందా? సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి అది రికార్డులు తిరగరాస్తూనే ఉంటుంది. అదే.. ప్రిన్స్ మహేష్‌బాబు, మురుగదాస్ సినిమా విషయంలో జరుగుతోంది.

మహేష్, మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ బైలింగ్వల్ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఫస్ట్‌లుక్ కూడా విడుదల అవ్వలేదు. అయినా అప్పుడే భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకోవడానికి భారీ అమౌంట్ ఆఫర్ చేస్తున్నారు. తాజాగా శాటిలైట్ హక్కుల రైట్స్ అత్యధిక రేటుకి అమ్ముడుపోయి, చరిత్ర సృష్టించింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని అక్షరాల రూ.26 కోట్లకు సొంతం చేసుకుంది. ఓ తెలుగు హీరో మూవీ ఈ రేంజ్‌లో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. టైటిల్, పోస్టర్ కూడా రిలీజ్ కాకుండానే శాటిలైట్ రైట్స్ ఇంత రేటుకి అమ్ముడుపోయాయంటే.. దీనిపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే.. ఈ మూవీ 100 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 18 వరకు అక్కడే చిత్రీకరణ కొనసాగనుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్‌ని జనవరి 1న, ఫస్ట్‌లుక్‌ని రిపబ్లిక్ డే సందర్భంగా 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news