Moviesకొరటాల.. ఈసారైనా మహేష్ మూవీకి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్దా!

కొరటాల.. ఈసారైనా మహేష్ మూవీకి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్దా!

Blockbuster director Koratala Siva is following his same strategy for Mahesh Babu film which he already applied for three films. But that not worked at all. So, now everyone discussing that this will workout or not.

దర్శకుడు కొరటాల శివ తన మొదటి చిత్రం నుంచి ఓ స్ట్రాటజీ ఫాలో అవుతూ వస్తున్నాడు. కానీ.. ప్రతిసారీ అది ఫెయిల్ అవుతూ వస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అదే స్ట్రాటజీని మహేష్ మూవీకి అప్లై చేస్తున్నాడు. దీంతో.. ఈసారైనా అది వర్కౌట్ అవుతుందా? లేదా? అనే విషయంపై ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా? అది తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

ఓ హీరోతో సినిమా కన్ఫమ్ చేసుకున్నాక.. ఇంకా ప్రారంభోత్సవం కాకముందే రిలీజ్ డేట్ ప్రకటిస్తాడు. ఇప్పటివరకు తాను తీసిన మూడు సినిమాలకు ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. అయితే.. మూడుసార్లు తాను ప్రకటించిన తేదీలకు సినిమాల్ని రిలీజ్ చేయలేకపోయాడు. ఏదో ఒక కారణం వల్ల తప్పకుండా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మహేష్‌బాబుతో త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న తన నాలుగో చిత్రం రిలీజ్ డేట్‌ని అప్పుడే ప్రకటించేశాడు. అవును.. ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని శరవేగంగా జరుపుకుంటున్న కొరటాల.. హీరోయిన్స్‌తోపాటు ప్రముఖ తారాగణాన్ని ఆల్రెడీ సెట్స్ చేసుకున్నాడు. వారి దగ్గరి నుంచి డేట్స్ తీసుకున్నాడు. వాటి ప్రకారం.. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ప్రొడక్షన్ కార్యక్రమాలకి ఎంత సమయం పడుతుంది? అన్నీ లెక్కలేసి.. విడుదల తేదీని ఖరారు చేశాడు.

దసరాకు పదిరోజుల ముందు అంటే 2017 సెప్టెంబర్ 22వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో.. ఈసారైనా ప్రకటించిన తేదీనాడే సినిమాని రిలీజ్ చేస్తాడా? లేదా గత మూడు సినిమాల్లాగే వాయిదా వేస్తాడా? అని అందరూ చెప్పుకుంటున్నారు. కాగా.. ఈ మూవీకి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ సీఎం పాత్రలో కనిపించబోతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news