” ఎన్టీఆర్ కథానాయకుడు ” పై మహేష్ షాకింగ్ కామెంట్స్..

85

ఎన్నో అంచనాలతో తెరెకెక్కడమే కాదు … ఆ అంచనాలను మించే స్థాయిలో ‘ఎన్టీఆర్’ కధానాయకుడు ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ నాతాను చూస్తే ఎన్టీఆర్ తో సరిసమానంగా నటనలో తన ప్రతిభను చాటుకున్నాడు. అందుకే వెండి తెర మీద ఈ సినిమాకు ప్రేక్షక నీరజనాలు దక్కుతున్నాయి.ఇక ఈ మూవీ గురించి ఇండ్రస్ట్రీకి సంబంధించి చాలామంది తమ తమ అభిప్రాయాలు ఏంటి అనేది చెప్పారు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటి అంటే…ఈ సినిమాకు సంబంధించి ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.

వాస్తవికత కథతో దర్శకుడు క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. బాలకృష్ణ గారు ఎన్.టి.ఆర్ గారిలా ప్రతి చిన్న సీన్ లోనూ జీవించేశారు. సినిమాలోని మిగతా అన్ని పాత్రలన్ని బాగా చేశారు. ఇది లెజెండరీ ఎన్.టి.ఆర్ కు బెస్ట్ ట్రిబ్యూట్ అవుతుందని అన్నారు మహేష్.ఒకవేళ దీన్ని మించేది ఏదైనా ఉంది అంటే అది మళ్లీ ఎన్.టి.ఆర్ మహానాయకుడే అవుతుందని ట్వీట్ చేశారు. దానికోసం ఎదురుచూస్తున్నా టీం అందరికి కంగ్రాట్స్ అంటూ మహేష్ ఎన్.టి.ఆర్ కథానాయకుడి మీద ప్రశంసల వర్షం కురిపించాడు.

Leave a comment