Gossips‘క్లోజప్’యాడ్ లో మహేష్ ని చూస్తే మైండ్ బ్లోయింగ్..!

‘క్లోజప్’యాడ్ లో మహేష్ ని చూస్తే మైండ్ బ్లోయింగ్..!

మహేష్ బాబు..ఈ పేరు వింటే వైబ్రేషన్..ఈ పేరులో మత్తు..అంటూ ఆ మద్య ‘అష్టాచమ్మ’సినిమాలో స్వాతి అనే డైలాగ్స్ గుర్తున్నాయి కదా..అవును ఇండస్ట్రీ అందగాడు మహేష్ బాబు తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఎన్నో యాడ్స్ లో నటిస్తూ అభిమానులకు మరింత చేరువు అయ్యాడు మహేష్. తాజాగా క్లోజ్ అప్ టూత్ పేస్ట్ యాడ్ లో తళుక్కున మెరిశాడు. ‘దగ్గరగా రా.. దగ్గరగా రా.. దగ్గరగా రావా’ అంటూ తన అందంతో యాడ్ కు మరింత ఆకర్షణను జోడించాడు.
23

22
ఇప్పటివరకూ క్లోజప్ యాడ్ లో ఎంతోమంది హీరోలను చూశాము. ఇటీవల అయితే ఈ యాడ్ లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించి అదరగొట్టారు. ఈ మద్య “భరత్ అనే నేను”తో భారీ హిట్ అందుకొని ఆ క్రేజ్ ను ఇంకా పెంచుకున్నాడు మహేష్. దీంతో మహేష్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంది ఓ యాడ్ సంస్థ… అందుకే మహేష్ బాబును తమ యాడ్ లో నటింపజేసి తమ బ్రాండ్ విలువను పెంచుకుంటోంది. ప్రస్తుతం మహేష్ కొన్ని వ్యాపారసంస్థలు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే.
24

25
తాజాగా క్లోజప్ యాడ్ లో ఓ ముద్దుగుమ్మతో కలిసి “దగ్గరగా రా.. దగ్గరగా రా… దగ్గరగా రావా” అంటూ స్టెప్పులేశాడు మన హ్యాండ్సమ్ ప్రిన్స్ మహేష్. ప్రస్తుతం మహేష్ ఖాతాలో ‘థమ్స్ అప్ , మహీంద్రా , టాటా స్కై, ఐడియా సెల్యూలర్, చెన్నై సిల్క్స్ ‘ మొదలైన వాటికీ ప్రచార కర్త గా చేస్తున్నాడు. తాజాగా ఈ లిస్ట్ లో ప్రముఖ టూత్ పేస్ట్ ‘క్లోజప్ ’సంస్థ కూడా చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ 28 సంస్థల బ్రాండ్లకు ప్రచారకర్త గా నియమించబడ్డారు. ఇప్పుడు 29 వ బ్రాండ్ గా క్లోజప్ చేరింది. తాజాగా ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://youtu.be/kmcSJtPuJF8

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news