బర్త్ డే రోజు సునామి సృష్టించిన మహేష్..

38

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కానుకగా ప్రస్తుతం తను నటిస్తున్న మహర్షి టీజర్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బర్త్ డే ఫ్యాన్స్ అంతా ట్విట్టర్ విశెష్ తో హోరెత్తేలా చేశారు. 24 గంటల్లో ఏకంగా 4.5 మిలియన్ మహేష్ బర్త్ డే ట్వీట్స్ వచ్చాయి. సూపర్ స్టార్ స్టామినా ఏంటో ఈ ట్వీట్స్ ను బట్టి కూడా చెప్పొచ్చు.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహర్షి సినిమాలో మహేష్ క్రేజీ లుక్ లో కనిపిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు హేమాహేమీలు కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 2019 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ హిట్ మేనియా కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Leave a comment