మహేష్ స్టామినా ఏంటో చూపిస్తున్న ‘భరత్ అను నేను’ బిజినెస్..!

mahesh babu bharath ane nenu business

బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత మహేష్ మురుగదాస్ కలిసి స్పైడర్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 27న ఆ సినిమా రిలీజ్ అవుతుండగా ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే కొరటాల శివతో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు మహేష్. శ్రీమంతుడు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ భరత్ అను నేను అని ప్రచారంలో ఉంది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల పైన అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల దాకా పలికాయని తెలుస్తుండగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 70 నుండి 80 కోట్ల దాకా బిజినెస్ చేస్తుందట. ఇక తమిళ, మలయాళ, హింది శాటిలైట్ రైట్స్ కూడా 22 కోట్ల దాకా వచ్చాయట. మొత్తంగా 115 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ తో మహేష్ భరత్ అను నేను సంచలనం సృష్టిస్తుంది.

స్పైడర్ అంచనాలను అందుకుంటే దానికి మించి కలక్షన్స్ వసూళ్లు చేసేందుకు భరత్ అను నేను వస్తుంది. బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సంచలనాలు సృష్టిస్తున్న మహేష్ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటాడో చూడాలి. అసలైతే 2018 సంక్రాంతికి భరత్ అను నేను రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

Leave a comment