Gossipsమహేష్, సుకుమార్ బాహుబలి బడ్జెట్..!

మహేష్, సుకుమార్ బాహుబలి బడ్జెట్..!

బాహుబలి సినిమాతో స్టార్ సినిమాలతో ఎలాంటి సాహసం అయినా చేయొచ్చని ప్రూవ్ అయ్యింది. ఆ సినిమా ముందు 150 కోట్లతో తీసేద్దాం అనుకోగా బడ్జెట్ పెరిగింది.. అందుకే ముందు ఒక పార్ట్ గా అనుకున్న సినిమా రెండు పార్టులుగా వచ్చింది. రెండు పార్టుల కలక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయో తెలిసిందే.
3
ఇక అదే విధంగా స్టార్ సినిమాలకు ఇప్పుడు బడ్జెట్ లిమిటేషన్స్ లేకుండా పోయింది. కరెక్ట్ గా కొడితే పెట్టిన మొత్తానికి డబుల్ ట్రిపుల్ వచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు 150 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజీ పడేది లేదని తెలుస్తుంది.
2
సుకుమార్ తో వన్ నేనొక్కడినే సినిమా చేసిన మహేష్ ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. ఇక ఈసారి మహేష్ తో కచ్చితంగా మెస్మరైజింగ్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నాడు. మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి కాగానే వెంటనే సుకుమార్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news