మహేష్ వర్సెస్ బన్ని.. ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు..!

mahesh and bunny

ఈ సమ్మర్ లో స్టార్ వార్ జరుగబోతుంది అన్నది తెలిసిందే. ఒకేరోజు సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ సినిమాలతో ఢీ కొట్టబోతున్నారు. మహేష్ కొరటాల శివ కాంబోలో భరత్ అనే నేను సినిమా చేస్తుంటే.. అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 27న రిలీజ్ అని ఫిక్స్ చేశారు.

మధ్యలో దర్శక నిర్మాతల మధ్య డిస్కషన్స్ జరిగినా అవి ఫలించకపోవడంతో బన్ని వర్సెస్ మహేష్ ఫైట్ షురూ అవుతుందని అంటున్నారు. రీసెంట్ గా రిబ్లిక్ డే సందర్భంగా సాంగ్ రిలీజ్ గురించి ప్రెస్ మీట్ పెట్టిన నా పేరు శివ టీం రిలీజ్ డేట్ చెప్పలేదు కాని ఆ తర్వాత అనుకున్న డేట్ కే వస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.

మరో పక్క మహేష్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా మొదటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అదే రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వస్తుందని తెలుస్తుంది. మరి మహేష్ రిలీజ్ డేట్ పై అఫిషియల్ గా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. మహేష్ తో పోటీ పడేందుకు బన్ని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాల కన్నా పరిశ్రమకు మంచిది కాదు.

వరుస సక్సెస్ లతో ఫాంలో ఉన్న బన్ని నా పేరు శివ కూడా హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇక మహేష్ కొరటాల శివ శ్రీమంతుడు మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇద్దరు ఏమాత్రం భయపడకుండా పోటీకి దిగడం అటు మహేష్ ఇటు అల్లు ఫ్యాన్స్ కు షాకింగ్ గా మారింది.

Leave a comment