Gossipsహిట్టు హీరోయిన్ కు బ్యాడ్ టైం నడుస్తుంది..!

హిట్టు హీరోయిన్ కు బ్యాడ్ టైం నడుస్తుంది..!

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబి బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా తెలుగులో హీరోయిన్ గా నిలబడిందని చెప్పొచ్చు. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్ అందుకున్న మెహ్రీన్ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఫేజ్ చేసింది. మళ్లీ అనీల్ రావిపుడి డైరక్షన్ లోనే ఎఫ్-2తో సూపర్ హిట్ అందుకుంది మెహ్రీన్. ఎఫ్-2 సక్సెస్ తర్వాత అమ్మడి కెరియర్ ఫుల్ బిజీ అవుతుందని ఆశించగా అలాంటిదేమి జరుగలేదు.

ఎఫ్-2 ఇచ్చిన హిట్టు కన్నా ఇదవరకు అమ్మడు నటించిన ఫ్లాప్ సినిమాలే ఎక్కువ ఎఫెక్ట్ చూపించడంతో మెహ్రీన్ కు టాలీవుడ్ లో ఛాన్సులు సన్నగిల్లాయని తెలుస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. హిట్టు హీరోయిన్ అనిపించుకున్నా సరే అమ్మడికి బ్యాడ్ టైం మాత్రం నడుస్తుంది. ఈమధ్య కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్న మెహ్రీన్ అక్కడ సడెన్ గా అమ్మడికి బ్రేక్ పడ్డది.

మోడల్ గా కెరియర్ ఆరంభించి హీరోయిన్ గా పర్వాలేదు అనిపించుకున్న మెహ్రీన్ కౌర్ అవకాశాల కోసం వేచి చూస్తుంది. సరైనా ఛాన్స్ రావాలే కాని తానేంటో చూపిస్తా అని చెబుతున్న అమ్మడు ఈసారి ఛాన్స్ వస్తే గ్లామర్ డోస్ కూడా పెంచే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మరి మెహ్రీన్ కెరియర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news