Gossipsనందమూరి హీరోకి చిక్కిన మెహ్రీన్..!

నందమూరి హీరోకి చిక్కిన మెహ్రీన్..!

నందమూరి కుర్రోడు కళ్యాన్ రామ్ నిర్మాతగానే కాకుండా హీరోగా తన సత్తా చాటుతున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో ‘తుగ్లక్’ సినిమా చేస్తున్నాడు కళ్యాన్ రామ్. ఈ సినిమా పూర్తయిన తర్వాత వెంటనే సతీష్ వేగేశ్న తో మరో సినిమాకు కమిట్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో కళ్యాన్ రామ్ కి హీరోయిన్ గా మెహ్రీన్ ను తీసుకున్నారు.

ఇంతవరకూ సతీశ్ వేగేశ్న ‘శతమానం భవతి’ .. ‘ శ్రీనివాస కల్యాణం’ వంటి కుటుంబ కథాచిత్రాలనే తెరకెక్కించారు. ‘శతమానం భవతి’ సూపర్ హిట్ కాగా… ‘ శ్రీనివాస కల్యాణం’ నిరాశపరిచింది. ఇక కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తర్వతా మెహ్రీన్ టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటుంది.

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్ 2’సినిమా మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్ పాత్రకి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news