నెగటివ్ టాక్ తో మహర్షికి తలనొప్పి..?

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న మూవీ మహర్షి. 130 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నా పెద్దగా బజ్ ఏర్పడలేదు. దీనికి కారణం మహర్షి ప్రచార చిత్రాల్లో మహేష్ మొత్తం శ్రీమంతుడు తరహాలో కనిపిస్తున్నాడు. టీజర్, సాంగ్స్ కూడా పెద్దగా మెప్పించలేదు.

అందుకే మహేష్ ఫ్యాన్స్ కూడా మహర్షి మీద అటు ఇటుగా ఉన్నారు. ఓ పక్క దర్శక నిర్మాతలు మాత్రం సినిమా తప్పకుండా సెన్సేషనల్ హిట్ అవుతుందని అంటుండగా సాంగ్స్, టీజర్ మాత్రం ఆ రేంజ్ లో లేవన్నది ప్రేక్షకుల మాట. ఇదిలాఉంటే సినిమాలో అల్లరి నరేష్ ది ఇంపార్టెంట్ రోల్ అన్నారు. ఆ రోల్ గురించి కాదు కదా కనీసం నరేష్ ను రివీల్ కూడా చేయట్లేదు. చోటి చోటి బాతె సాంగ్ లో కనిపించాడు తప్ప టీజర్ లో అసలు కనిపించలేదు.

ఎంత కాదన్న అతను ఓ హీరో అలాంటిది టీజర్ లో కనీసం చిన్న స్పేస్ కూడా ఇవ్వలేదని తెలిసిందే. మరోపక్క నరేష్ పాత్ర కావాలనే రివీల్ చేయకుండా ఉంటున్నారని తెలుస్తుంది. మొత్తానికి మే 9న ప్రపంచవ్యాప్తంగా మహర్షి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మహేష్ హిట్ మేనియా కొనసగిస్తుందా లేదా అన్నది చూడాలి.

Leave a comment