Gossipsమహేష్ మహర్షి రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది..?

మహేష్ మహర్షి రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది..?

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను తర్వాత చేస్తున్న క్రేజీ మూవీ మహర్షి. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ పై అఫిషియల్ క్లారిటీ వచ్చేసింది. మహర్షి నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సినిమా రిలీజ్ డేట్ చెప్పేశారు.

ముందు ఏప్రిల్ 5,6 డేట్స్ లో మహర్షి రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఆ టైంకు రెండు మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. నాని జెర్సీ, నాగ చైతన్య మజిలితో పాటుగా మరో సినిమా ఏప్రిల్ మొదటి వారంలో వస్తున్నాయి. అందుకే ఏప్రిల్ చివరి వారంలో మహేష్ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఏ డేట్ న అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఎఫ్-2 సక్సెస్ జోష్ లో శ్రీవారి దర్శనానికి వెళ్లిన దిల్ రాజు ఫైనల్ గా మహర్షి రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

ఏప్రిల్ 25న మహర్షి రిలీజ్ పక్కా అని చెప్పారు దిల్ రాజు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ క్యారక్టరైజేషన్ తో కనిపిస్తాడట ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశ పరచాగా మళ్లీ భరత్ అనే నేనుతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు మహేష్. మరి మహర్షితో ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news