మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ సర్ ప్రైజ్ అదే..!

4

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.

ఇప్పటికే ప్రచార చిత్రాలు, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మే 9న రిలీజ్ అవుతున్న మహర్షి సినిమా మే 1 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టులుగా మహేష్ తో ఇంతకుముందు తీసిన 24 సినిమాల దర్శకులంతా అటెండ్ అవుతారట. వారికే ఆహ్వానం పంపుతున్నట్టు తెలుస్తుంది. మహేష్ మహర్షి సినిమా కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని దిల్ రాజు చెబుతున్నారు.

సినిమాలో మహేష్ 3 డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే బిజినెస్ కూడా భారీగా జరుగుతున్న మహర్షి సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా అదరగొడుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న మహర్షి సినిమా ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి మ్యూజిక్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment