Gossips‘మహర్షి’ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆర్ఆర్ఆర్ సందడి..!

‘మహర్షి’ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆర్ఆర్ఆర్ సందడి..!

అదేంటీ మహర్షి మూవీ సినిమాకు ఆర్ఆర్ఆర్ సందడి ఏంటా అని అనుకుంటున్నారా..అవును త్వరలో వంశి పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘మహర్షి’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలనే ప్లాన్ వేశారు. కేవలం ప్రచారం కోసమే కాకుండా.. ఈసారి సెంటిమెంట్ కూడా ఫాలో అవుతున్నారని సమాచారం. మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

మహేష్-ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడంతో సినిమాకు కావలసినంత పబ్లిసిటీ వచ్చింది. ఆ సినిమా మంచి విజయం అందుకుంది..ఈ నేపథ్యలో మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవాలనుకున్నారట. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ ‘RRR’ షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. కాబట్టి ఈవెంట్ కి హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఆ మద్య పూనేలో తన కాలుకి గాయం కారణంగా చరణ్ కూడా షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఈసారి చరణ్ కి కూడా ఆహ్వానిస్తారని అంటున్నారు. నిజ జీవితంలో ఈ ముగ్గురూ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఆ హడావిడే వేరుగా ఉంటుంది. ఇక ఈవెంట్ విషయానికొస్తే.. మే 1న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో వేడుక జరగనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news