Moviesడిజిటల్ రైట్స్ లో ''మహర్షి '' సరికొత్త రికార్డ్..!

డిజిటల్ రైట్స్ లో ”మహర్షి ” సరికొత్త రికార్డ్..!

ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు మహేష్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇక సరికొత్త కధాంశంతో తెరకెక్కుతున్న ” మహర్షి” సినిమా ఇప్పటికే… ఫస్ట్ లుక్ విడుదలై సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ఇటీవలే ఈ చిత్ర షెడ్యూల్ అమెరికా లో పూర్తి చేసుకొని ఇండియా కు వచ్చింది

.సినిమా విడుదలకు ఇంకా ఇంకా సమయం ఉండగానే అన్ని రైట్స్ అమ్ముడవుతుండడం నిర్మాతలు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా , అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం సెట్స్ ఫై ఉండగానే చిత్ర రైట్స్ ను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే హిందీ డబ్బింగ్ రైట్స్ ను రూ. 20 కోట్ల కు అమ్ముడవగా , తాజాగా డిజిటల్‌ రైట్స్‌ సైతం భారీ రేటుకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ దాదాపు 12కోట్లకు ఈ డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహర్షి’ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాను దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. భరత్ అనే నేను సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో మహర్షి పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news