Movies' మ‌హ‌ర్షి ' లో డిలీట్ సీన్లు... మీకోసం స్పెష‌ల్‌గా...

‘ మ‌హ‌ర్షి ‘ లో డిలీట్ సీన్లు… మీకోసం స్పెష‌ల్‌గా…

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరోగా – ద‌ర్శకుడు వంశీ పైడిపల్లి తెర‌కెక్కించిన చిత్రం మహర్షి. బాక్సాఫీస్ వద్ద మ‌హ‌ర్షి మంచి వసూళ్లు సాధించింది. సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు వీకెండ్ వ్య‌వ‌సాయం చేస్తే అనే కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నైజాంలోనే ఏకంగా రూ.30 కోట్ల షేర్ సాధించి రికార్డుల‌కే రాజుగా మారిపోయింది.

ఇక తాజాగా మ‌హ‌ర్షి ఏపీలోని ఐదు కేంద్రాల‌లో దిగ్విజ‌యంగా 100 రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమాలో ఎడిట్‌లో క‌ట్ అయిన ఓ స‌న్నివేశం ఇప్పుడు లీక్ అయ్యింది. ఈ సీన్ చాలా ఇంట్ర‌స్టిగ్‌గా ఉంది. బీజీఎమ్ లేకుండా సాగే ఓ సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. కాలేజ్ క్యాంపస్ లో మహేష్ కి మరో విద్యార్థికి మధ్య చిన్న సంఘర్షణ, ఈ సీన్‌లో మ‌హేష్ పూజ‌ను క్లాస్‌రూమ్‌కు పంపేసి మ‌రో స్టూడెంట్‌తో మాట్లాడుతుండ‌గానే వారిద్ద‌రి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ స్టార్ట్ అవుతుంది.

చివ‌ర‌కు ఈ ఇద్దరిని ప్రిన్సిపాల్ మందలిస్తాడు. తాజాగా ఈ సన్నివేశానికి సంబందించిన వీడియోని విడుదల చేశారు. 3.38 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో ఇప్పుడు విడుద‌ల చేయ‌డంతో బాగా ఆక‌ట్టుకుంటోంది. మహర్షి మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర చేశారు.మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత మళ్ళీ ఆయన వంశీ పైడిపల్లి చిత్రంలో నటించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news