మరో ‘బ్రహ్మోత్సవం’గా మహర్షి..!

116

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా ఈ సినిమాను ముగ్గురు పెద్ద నిర్మాతలు ప్రొడ్యూస్ చేయడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్‌లో జరిగింది. ఇప్పుడు ఇదే మహర్షి కొంప ముంచింది. ఈ సినిమా మహేష్ గత చిత్రాలైన బ్రహ్మోత్సవం, స్పైడర్ లాగానే అట్టర్ ఫ్లాప్‌గా మిగులుతుందని బయ్యర్లు వాపోతున్నారు.

అప్పట్లో బ్రహ్మోత్సవం సినిమాను ఓవర్సీస్ బయ్యర్లు భారీ రేటుకు కొనుక్కొని నిండా మునిగారు. అయితే మహర్షి సినిమాను కూడా అదే స్థాయిలో భారీ రేటుకు సొంతం చేసుకున్నారు అక్కడి బయ్యర్లు. కాగా ఇప్పటివరకు మహర్షి సినిమా కేవలం 1.74 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా టోటల్ రన్‌లో 1.8 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని.. యూఎస్ఏ బయ్యర్లు ఏకంగా రూ.2 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.

కాగా మహర్షి సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. నిజాంలో ఏకంగా రూ.25 కోట్ల బిజినెస్‌తో బయ్యర్లకు లాభాలు తెచ్చి పెడుతోంది. ఏదేమైనా మహర్షి కూడా మరో ‘బ్రహ్మోత్సవం’లా మిగలడం అక్కడి బయ్యర్లను బోరున ఏడుస్తున్నారు.

Leave a comment