దసరా బరి లో విన్నెర్ గా నిలిచింది ఎవరు ?

JR NTR MAHESH BABU SHARVANAND

పండగ వస్తే చాలు టాలీవుడ్ లో ఆ వాతావరణం బెట్టు గ కనపడుతింది . ప్రతీ పండుగకి 3 , 4  సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి . ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వకుశ‌, 27న మ‌హేష్ స్పైడ‌ర్ రిలీజ్ అయితే తాజాగా ఈ రోజు శ‌ర్వానంద్ మ‌హానుభావుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఏ సినిమా లెక్క ఎలా ఉందో చూద్దాం. ద‌స‌రా సీజ‌న్‌లో వారం రోజులు ముందుగానే ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాతో వ‌చ్చేశాడు. ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని నిర్మాత క‌ళ్యాణ్‌రామ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా  ప్ర‌క‌టించేసారు .

జై ల‌వ‌కుశ ఆల్రెడీ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల దుమ్ముదులుపుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమాకు ఇప్పటివరకు 66 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి . ఇంకో వరం రోజుల్లో  ఈ సినిమా బయ్యర్లు సేఫ్ జోన్ కి రావచ్చని ట్రేడ్ వర్గాల అంచనా . ఎటు స్పైడర్ కి నెగెటివ్ టాక్  ఉండటం , మహానుభావుడు పెద్ద సినిమా కాకా పోవడం , జై లవ కుశ కు ప్లస్ అనే చెప్పాలి . ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టడం ఖాయం గ కనిపిస్తుంది .

ఇక స్పైడ‌ర్ తొలి రోజుకే ఎక్కువుగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రూ.156 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధిస్తే గాని గ‌ట్టెక్క‌దు. తొలి రోజు రూ.51 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని చిత్ర‌యూనిట్ చెపుతున్నా రెండో రోజు నుంచే క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఈ సినిమా త‌మిళ్‌లో ఏమో గాని తెలుగులో బ‌య్య‌ర్లును భారీగా ముంచ‌డం ఖాయ‌మని ట్రేడ్ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది. స్పైడర్ సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకేక్కిన్చాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు.

ఇక ఈ రోజు రిలీజ్ అయిన మ‌హానుభావుడు సినిమా లో బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి త‌క్కువుగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమాకు ఇప్ప‌టికే హిట్ టాక్ వ‌చ్చేసింది. ఎప్పుడూ పండక్కి సైలెంట్‌గా హిట్లు మీద హిట్లు కొడుతోన్న శ‌ర్వా ఈ సారి కూడా ద‌స‌రా పండ‌క్కి రెండు పెద్ద సినిమాలు అయిన జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ సినిమాల మ‌ధ్య‌లో వ‌చ్చి హిట్ కొట్టేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఇక జై ల‌వ‌కుశ‌ సూపర్ సక్సెస్ సాధించింది , అదే సినిమా కలెక్షన్స్ లో కూడా చూపిస్తుంది . స్పైడ‌ర్‌కు భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇక లో బ‌డ్జెట్‌తో త‌క్కువ బిజినెస్ చేసిన మ‌హానుభావుడు హిట్ టాక్‌తో లాభాలు సాధించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌న‌ప‌డుతున్నాయి.

Leave a comment