మహానుభావుడు కాపీ.. డైరక్టర్ ఫైర్ అయ్యాడు..!

mahanubavudu

శర్వానంద్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహానుభావుడు. ఈమధ్యనే ట్రైలర్ రిలీజ్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు ఓ కొత్త తలనొప్పి వచ్చి పడింది. సినిమా ట్రైలర్ చూసి సినిమా మలయాళం మూవీ నార్త్ 24 కాథమ్ కు కాపీ అంటూ కొత్త రచ్చ మొదలు పెట్టారు. 2013 లో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.

మహానుభావుడు సినిమాలో లానే ఆ సినిమాలో హీరోకి అతి శుభ్రత అనే అలవాటు ఉంటుంది. అందుకే ఆ సినిమాకు అది కాపీ అని అంటున్నారు. అయితే ఈ విషయంపై మహానుభావుడు డైరక్టర్ మారుతి స్పందించి క్యారక్టరైజేషన్ ఒకేలా ఉన్నంత మాత్రాన సినిమాలు ఎలా కాపీ అంటారని వాదిస్తున్నాడు. ఇలాంటి పాత్ర స్వభావాలతో చాలా సినిమాలు వచ్చాయని అయినంత మాత్రానా అవి కాపీ అనడం కరెక్ట్ కాదని అన్నాడు.

ఈ నెల 29న రిలీజ్ అంటున్న మహానుభావుడు రిలీజ్ విషయంలో మాత్రం కాస్త ఆలోచనలో పడ్డారని టాక్. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి.

 

Leave a comment