వసూళ్లుకు ఎదురుదెబ్బ…! మరి ఇంత దారుణంగానా..!

mahanti-us-second-weekend-collections

సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ అన్న టాక్ వచ్చింది. యూఎస్ లో అయితే ఈ సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలక్షన్స్ 1.5 మిలియన్ డాలర్స్ వసూళు చేసి ప్రభంజనం సృష్టించాయి. ఇక ఈ సినిమా ఇప్పటికే అక్కడ 2 మిలియన్ క్రాస్ చేయగా సెకండ్ వీక్ లో మహానటి కలక్షన్స్ అనూహ్యంగా డ్రాప్ అయ్యాయని తెలుస్తుంది.

ట్రెడ్ వర్గాల సమాచారం ప్రకారం సెకండ్ వీక్ లో కేవలం 3 లక్షల డాలర్స్ మాత్రమే మహానటి రాబట్టింది. ప్రస్తుతానికి యూఎస్ లో ఈ సినిమా 2.3 మిలియన్ డాలర్స్ మాత్రమే వసూళు చేసింది. సెకండ్ వీక్ లో ఫిదా, అఆ సినిమాల కన్నా మహానటి కలక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అయితే లాంగ్ రన్ ఉన్న సినిమా కాబట్టి కచ్చితంగా ఇది 3 మిలియన్ డాలర్స్ వసూళు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

కీర్తి సురేష్ లీడ్ రోల్ గా నటించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్లో అశ్వనిదత్ సమర్పించగా స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు.

Leave a comment