మహానాయకుడు రిలీజ్ డేట్ అదేనా..!

Mahanayakudu release date

క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు అంచనాలను అందుకోలేదు. బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఎన్.టి.ఆర్ లాంటి మహనీయుడు జీవితకథను ఆడియెన్స్ ను మెప్పించేలా తీయలేకపోయారు. ఇక సెకండ్ పార్ట్ గా రానున్న మహానాయకుడు అయినా అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్న డౌట్ మొదలైంది. జనవరి 25న రిలీజ్ అనుకున్న ఆ సినిమా ఫిబ్రవరి 7కి వాయిదా వేశారు.

ఇక ఇప్పుడు ఫైనల్ గా ఎన్.టి.ఆర్ మహానాయకుడు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 22న ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా వస్తుంది. మొదటి పార్ట్ అదే కథానాయకుడు ఎక్కడ ఆగిందో అక్కడ నుండి ఈ సినిమా మొదలవుతుంది. మహానాయకుడు సినిమాలో ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానం చూపించబోతున్నారు. మరి ఈ మహానాయకుడు అయినా అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి. బాలకృష్ణ నిర్మించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ భారీ రేటుకి అమ్మగా అది నిరాశపరచడంతో ఆ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా ఇస్తున్నారట.

Leave a comment