మహానటి శాటిలైట్ రైట్స్.. దిమ్మతిరిగే రేటు..!

mahanati-tv-rights

సావిత్రి బయోపిక్ అనగానే సినిమా ఓ డాక్యుమెంటరీలా ఉంటుందని అందరు అనుకున్నారు. కాని సినిమా స్టార్ సినిమాలకు పోటీగా నిలబడి వసూళ్లను రాబడుతుంది అంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ కీర్తి సురేష్ అద్భుత నటన కలిసి మహానటిని సూపర్ హిట్ చేశాయి.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు రావడం విశేషం. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో శాటిలైట్ రైట్స్ కు రెక్కలొచ్చాయని తెలుస్తుంది. జెమిని, జీ తెలుగు, స్టార్ మా ఇలా మహానటి శాటిలైట్ రైట్స్ కోసం డిమాండ్ ను బట్టి పోటీ పడగా ఫైనల్ గా జీ తెలుగు 11 కోట్ల భారీ మొత్తంతో మహానటిని సొంతం చేసుకున్నారట.

స్టార్ సినిమా రేంజ్ లో శాటిలైట్ అందుకున్న ఈ మహానటి సినిమా బుల్లితెరలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పొచ్చు. ఈమధ్య కాలంలో స్టార్స్ లేకుండా ఈ రేంజ్ శాటిలైట్ రైట్స్ అందుకున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. సినిమా ఈ రేంజ్ కు ముందే వెళ్తుందని ఊహించిన అశ్వనిదత్ రిలీజ్ కు ముందు 6, 7 కోట్ల శాటిలైట్ ఆఫర్ వచ్చినా ఆఫ్టర్ రిలీజ్ అని చెప్పారట. ఎలా లేదన్నా మహానటికి 11 కోట్ల శాటిలైట్ రైట్స్ అంటే సినిమా ప్రాఫిట్స్ లో ఇది కూడా యాడ్ అవుతుందన్నమాట.

Leave a comment