Movies” మహానటి ” రివ్యూ & రేటింగ్

” మహానటి ” రివ్యూ & రేటింగ్

కథ :

జీవిత కథను సినిమాగా తెరకెక్కించే క్రమంలో కథ ఇది అని చెప్పలేం. ప్రజావాణి జర్నలిస్ట్ అయిన మధురవాణి (సమంత) సావిత్రి మీద ఓ స్టోరీ కవర్ చేయాలని చూస్తారు. ప్రజావాణి ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ నటించారు. కోమాలో ఉన్న సావిత్రి గురించి మధురవాణి కవర్ చేసే స్టోరీనే సావిత్రి జీవిత కథగా తెర మీద చూపిస్తారు. ఆమె సినిమా తెరంగేట్రం.. హీరోయిన్ గా టాప్ రేంజ్ కు వెళ్లడం.. కుటుంబ కలహాలు.. మధ్యానికి బానిస అవ్వడం.. చివరి దశల్లోకి వెళ్లడం ఈ కథ అంతా ప్రస్థావించడం జరిగింది.

నటీనటుల ప్రతిభ :

సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు. మహానటిగా కీర్తి సురేష్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. కచ్చితంగా అవార్డులు సైతం వచ్చేలా కీర్తి నటన ఉంది. ఇక సినిమాలో వాణి, విజయ్ ల నటన బాగుంది. సమంత కూడా క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో బాగా నటించింది. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ బాగా చేశాడు. ఇక ఏయన్నార్ గా నాగ చైతన్య సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఎస్వీయార్ గా మోహన్ బాబు, దర్శక నిర్మాత చక్రపాణిగా ప్రకాశ్ రాజ్, కెవి చౌదరిగా రాజేంద్ర ప్రసాద్, క్రిష్ లాంటి నటులు నిజ పాత్రలకు ఏమాత్రం తీసిపోకుండా నటించడం జరిగింది.

సాంకేతికవర్గం పనితీరు :

టెక్నికల్ గా మహానటి సినిమా చాలా హై స్టాండర్డ్స్ లో తీశారని చెప్పొచ్చు. 1940, 60, 80 కాలం నాటి సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా గురించి చాలా రీసెర్చ్ చేసి మరి సినిమా తీయడం జరిగిందని తెలుస్తుంది. మిక్కి జే మేయర్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతం. డైరక్టర్ నాగ్ అశ్విన్ చాలా మహానటికి గొప్ప న్యాయం చేశాడు. చాలా పద్ధతిగా సినిమా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అని చెప్పొచ్చు.

విశ్లేషణ :

తెలిసిన కథను డీటైల్డ్ గా సినిమాగా చెప్పడంలో చాలా తెలివితేటలు ఉండాలి. సావిత్రిగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న మహానటి జీవిత కథను సినిమాగా తెరకెక్కించిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. దర్శకుడు సావిత్రి జీవితంలో ముఖ్య ఘట్టాలను చాలా క్లారిటీతో తెరకెక్కించాడు.

తారల అభినయం తారాస్థాయిలో ఉండగా.. కథ, కథనాలు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. మొదటి భాగం కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగించగా సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. సావిత్రి పతనం ఇంకా ప్రా క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్స్ కంట తడి పెట్టించేదిగా ఉంటాయి. పాత్రలన్ని తమ అద్భుత నటనతో మాహనటి సినిమాకు ప్రాణం పోశాయి.

ముఖ్యంగా మహానటి టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేష్ మాత్రం కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు అవార్డ్ విన్నింగ్ అభినయంతో ఆకట్టుకుంది. ఆమె తప్ప మిగతా ఎవరు ఈ పాత్రకు న్యాయం చేయలేరని చెప్పొచ్చు. సమంత నటన కూడా చాలా బాగుంది. దుల్కర్ సల్మాన్ కూడా బాగా చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

కీర్తి సురేష్

అన్ని పాత్రల అభినయం

కథనం

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

మహానటి.. పర్ఫెక్ట్ బయోపిక్..!

రివ్యూ & రేటింగ్ : 3.25

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news