మహానటి ఓవర్సీస్ కలక్షన్స్.. 40 ఏళ్లు దాటినా తగ్గని సావిత్రమ్మ క్రేజ్ ఇది..!

mahanati-overseas-collectio

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అశ్వనిదత్ నిర్మాణంలో స్వప్నా దత్, ప్రియాంకా దత్ లు నిర్మించారు. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా బీభత్సమైన వసూళ్లను రాబడుతుంది. ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ తెచ్చుకున్న మహానటి సినిమా ఇప్పటికే 1.6 మిలియన్ డాలర్స్ వసూళు చేయడం విశేషం.

స్టార్ సినిమాలకు పొటీగా మహానటి సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. 40 ఏళ్లు దాటినా సావిత్రమ్మ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మహానటి వసూళ్లను చూస్తుంటేనే అర్ధమవుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ అభిమానులను ఈ సినిమా బాగా నచ్చేసింది.

సినిమాను గొప్ప విజయం అందించి ఆమెకు ఘనమైన నివాళి అందించారు అశేష ప్రేక్షక జనం. బాక్సాఫీస్ పై స్ట్రాంగ్ గా దూసుకెళ్తున్న మహానటి సినిమా చూస్తుంటే సంచలన రికార్డులు సృష్టించేలా ఉంది.

Leave a comment