Moviesమహానటిలో మరో అద్భుతమైన సీన్.. ఎందుకు డిలీట్ చేశారో.. జెమినీ గణేష్...

మహానటిలో మరో అద్భుతమైన సీన్.. ఎందుకు డిలీట్ చేశారో.. జెమినీ గణేష్ భార్యలంతా ఒకచోట హంగామా (వీడియో)

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా విజయం సాధించింది. సావిత్రి జీవిత కథలోని ముఖ్య భాగం ఈ సినిమాలో చూపించారు. ఇక సినిమా రష్ చాలా ఎక్కువగా వచ్చినా ఫైనల్ కట్ మాత్రం ఆడియెన్స్ ను మెప్పించింది. బయోపిక్ సినిమానే అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలోని కొన్ని డిలీటెడ్ సీన్స్ చిత్రయూనిట్ రిలీజ్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా సావిత్రి, జెమిని గణేషన్, పుష్పవల్లికి సంబందించిన సీన్స్ ఈరోజు రిలీజ్ చేశారు. పుష్పవల్లి కూతురు రేఖ. ఆమె జెమిని గనేషన్ ను నాన్న అని పిలవడం.. అది విన్న సావిత్రి కూతురు విజయ తల్లికి చెప్పడం అప్పుడు సావిత్రి తన మంచి మనసుతో ఆమెకు సర్ధిచెప్పడం ఈ సన్నివేశంలో ఉంది.

సినిమాలో ఇది కూదా మరో అద్భుతమైన సన్నివేశం. కాని సినిమా డ్యూరేషన్ దృష్టిలో పెట్టుకుని ఫైనల్ కట్ లో ఉంచలేదు. యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుంది. సావిత్రిగా కీర్తి సురేష్, జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news