Moviesచిరంజీవి ని దాటేసిన మహానటి .. మహానటికి మాత్రమే అది సాధ్యమైంది..!

చిరంజీవి ని దాటేసిన మహానటి .. మహానటికి మాత్రమే అది సాధ్యమైంది..!

సావిత్రి జీవిత కథతో వచ్చిన మహానటి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించడం విశేషం. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ప్రీమియర్స్ తో పాటుగా మొదటి రోజులోనే మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన మహానటి సినిమా ఏకంగా యూఎస్ టాప్ కలక్షన్స్ లో 6వ స్థానంలో నిలిచింది.

ఈ సినిమా ఇప్పటివరకు యూఎస్ లో 2.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ఖైది నంబర్ 150, అ ఆ సినిమాలను దాటేసింది. ఇక ఫుల్ రన్ లో 2.7 మిలియన్ డాలర్స్ వసూళు చేయొచ్చని అంటున్నారు. బాహుబలి-2, బాహుబలి-2, రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు టాప్ 5 లిస్ట్ లో ఉన్నాయి. ఒకవేళ 2.87 మిలియన్ డాలర్స్ వసూళ్లను దాటితే శ్రీమంతుడు కన్నా మహానటి టాప్ 5వ స్థానంలో ఉంటుంది.

వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ సమర్పించిన ఈ సినిమాను స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ మూవీ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news