జక్కన్న చేతికి ‘మహాభారతం’ మహా సంచలనమే..!

136

భారీ బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ తో ఇండ్రస్ట్రీ బాహుబలిగా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తరువాత సినిమాపై ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు చెప్పడంతో తర్వాతి చిత్రం మహాభారతమే అని అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం మహాభారతాన్ని తీసే అంత అనుభవం నాకు రాలేదు అంటూ అప్పట్లో తప్పించేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్టే కనిపిస్తోంది.

వాస్తవంగా మహా భారతాన్ని తెరకెక్కించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 1000కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో మరోసారి రాజమౌళి మహాభారతం చర్చకు వచ్చింది. మోహన్ లాల్ అంత భారీగా రూపొందించిన సినిమాని తిరిగి రాజమౌళి అదే కథని తీస్తాడా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే జకన్న మాత్రం మహాభారతం తీసే విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

ప్రపంచదేశాలు కన్నేసిన భారతీయ పురాణేతిహాసం `మహాభారతం`ను తెరకెక్కించాలంటే దమ్ము కావాలి. డబ్బును మించి గట్స్ కావాలి. కానీ అది బాలీవుడ్ వాళ్లకు – మల్లూవుడ్ వాళ్లకు చేతకాని పనే అయ్యింది. ఆశ పడ్డారు కానీ – వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. సనాతన సాంప్రదాయాలకు – యుక్తులు – కుయుక్తులు – అన్నదమ్ములు రాజకీయాలకు ఆలవాలం అయిన `మహాభారతం`ను తెరకెక్కించే ఛాన్స్ ఇప్పుడు రాజమౌళి ముంగిటకు వచ్చింది.

మహా భారతాన్ని అమీర్ ఖాన్ తో తెరకెక్కించాలని రిలయన్స్ అంబానీలు ప్రయత్నిచారు.
అయితే ఆ చిత్రాన్ని ఐదు భాగాలుగా తీస్తాననడంతో వారు వెనక్కి తగ్గారు.
అంటే బాలీవుడ్లో `3డి మహాభారతం, మాలీవుడ్ లో `1000 కోట్ల మహాభారతం`తీయలేక వారు చేతులెత్తేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసేందుకు రాజమౌళి సిద్ధం అవుతుండడంతో వారంతా కంగారుపడుతున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమా తీసి 2 వేల కోట్లు కొల్లగొట్టిన జక్కన్న సత్తా ఏంటో ఆ బాలీవుడ్ , మల్లువుడ్ వారికేంటి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇక జక్కన్న ఈ సినిమా విషయంలో ముందడుగు వేస్తే ఈ మహాభారతం ప్రపంచ సంచలనమే అవుతుందనడంలో సందేహమే లేదు.

Leave a comment