మెర్సల్ లో తప్పేముంది అన్న హైకోర్ట్..!

ఓ సినిమాపై ఇంత‌టి వివాద‌మా

ఓ చిన్న డైలాగ్ పై ఇంత‌టి ప్ర‌కంప‌న‌మా

త‌ప్పు క‌దూ! జీఎస్టీ అనే విధానం న‌చ్చ‌కుంటే

చెప్ప‌డం ఓ నేరంలా భావించ‌డం త‌ప్పు క‌దూ!

ఇక ఈ సినిమాపై మ‌ద్రాస్ హైకోర్టు కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

మెర్సల్ అన్నది ఒక కల్పిత కథా చిత్రమని.. అదేమీ నిజ జీవితంగాథ కాదుగా? అన్న న్యాయమూర్తి.. సమాజంపై ఈ చిత్రం ప్రభావం చూపుతుంద నటం అర్థరహితమని వ్యాఖ్యానించారు.దీనిని నిషేధించాల‌ని చెప్ప‌డం భావ్యం కాదంది.ధూమపానం.. మద్యపానం హానికరమంటూ ప్రకటనలు జారీ చేసే చిత్రాల కంటే మెర్సల్ అంత డేంజరా? అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు న్యాయ మూర్తి ప్రశ్నించారు.అంతేకాదు.. సినిమా నచ్చకుంటే చూడటం మానేయాలని.. అంతేకానీ ఇలాంటి పిటిషన్లు వేసే కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని హిత‌వు చెప్పారు.

 

Leave a comment