Gossips'మా' చేతిలో మహానటి... చుక్కలంటిన శాటిలైట్ రైట్స్

‘మా’ చేతిలో మహానటి… చుక్కలంటిన శాటిలైట్ రైట్స్

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా రిలీజ్ అయ్యి 25 రోజులవుతున్నా ఇంకా ఆ సినిమా వసూళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. సంచలన విజయం అందుకున్న ఈ సినిమా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కింది. అశ్వనిదత్ సమర్పణలో స్వప్న, ప్రియాంకా దత్ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమాకు రిలీజ్ ముందు 5 కోట్ల శాటిలైట్ ఆఫర్ రాగా ఆఫర్ ను తిరస్కరించారు.

రిలీజ్ అయిన మొదటి వారం కూడా 11 కోట్ల దాకా ఇస్తామని మరో ఆఫర్ వచ్చిందట. ఇక ఇప్పుడు ఫైనల్ గా స్టార్ మా 15 కోట్లతో మహానటి శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం గట్టి పోటీ ఏర్పడిందట. జెమిని, జీ తెలుగు, స్టార్ మా మూడు ఛానెళ్లు ఫ్యాన్సీ ప్రైజ్ నే ఆఫర్ చేశాయట.

కాని అందరికన్నా ఎక్కువ స్టార్ మా 15 కోట్లు కోట్ చేయడంతో సినిమా వాళ్లకే దక్కింది. కీర్తి సురేష్ సావిత్రి గా ంటించిన ఈ సినిమాలో జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ నటించాడు. సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news