Moviesరాజ్ తరుణ్ " లవర్ " రివ్యూ & రేటింగ్

రాజ్ తరుణ్ ” లవర్ ” రివ్యూ & రేటింగ్

లవర్ బోయ్ ఇమేజ్ కు దగ్గరగా వచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ ఒక హిట్టు రెండు ఫ్లాపులుగా కెరియర్ సాగిస్తున్నాడు. తన కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో దిల్ రాజు లాంటి ప్రొడక్షన్ లో చేసిన సినిమా లవర్. రిద్ధి కుమార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అనీష్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

బైక్ కస్టమైజేషన్ ఇంజినీర్ అయిన రాజ్ (రాజ్ తరుణ్) నర్స్ గా పనిచేస్తున్న చరిత(సిద్ధి కుమార్)ను యాక్సిడెంట్ ద్వారా కలుస్తాడు. ఆమెని చూసిన మొదటి ప్రేమలోనే ప్రేమించిన రాజ్ ఆమెని ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. ఈ టైంలో చరిత కిడ్నాప్ అవుతుంది. ఆమె రిస్క్ లో ఉందని తెలుసుకున్న రాజ్ ఆమెను కాపాడేందుకు విలన్లను ఢీ కొడతాడు. ఫైనల్ గా తన ప్రేయసిని, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నదే లవర్ కథ.

నటీనటుల ప్రతిభ :

లవర్ గా ఎప్పటిలానే రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. అయితే తన పోనీ టైల్ హెయిర్ స్టైల్ అతనికి ఏమాత్రం సూట్ అవలేదు. క్యారక్టరైజేషన్ లో తన ఇదవరకు సినిమాలతో పోలిస్తే ఏమాత్రం తేడా కనబడలేదు. ఇక సిద్ధి కుమార్ క్యూట్ గా ఉంది. స్క్రీన్ టైం ఎక్కువగా హీరో హీరోయిన్స్ కనబడతారు. మిగతా వారంతా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

అనీష్ కృష్ణ రొటీన్ కథతోనే లవర్ సినిమా చేశారు. కథ, కథనం అంతా ఆడియెన్స్ కూడా ఊహించేలా ఉంటాయి. దర్శకుడు ఆ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను బాగా చూపించారు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంకిత్ తివారి మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది.

విశ్లేషణ :

అలా ఎలా తర్వాత అనీష్ కృష్ణ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ లవర్. దిల్ రాజు లాంటి బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా ఏమాత్రం కొత్తదనం లేకుండా వచ్చింది. కథ, కథనాల్లో దర్శకుడు రొటీన్ పంథా కొనసాగించాడు. అంతేకాదు ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ కూడా అంతా నీరసంగా సాగుతుంది.

రాజ్ తరుణ్ లో మునుపటి జోష్ కనబడలేదు. హీరోయిన్ ఓకే అయినా వారి మధ్య కెమిస్ట్రీ కూడా రొటీన్ గానే ఉంటుంది. స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న లీడ్ పెయిర్స్ మధ్య సీన్స్ కూడా రొటీన్ గానే ఉంటాయి. కథలో ట్విస్టులు ఆడియెన్స్ ఊహించేలా ఉంటాయి.

ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా రిచ్ గా అనిపించినా దిల్ రాజు ఈ సినిమా ఎలా చేశాడనే డౌట్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో ముందే తెలియడంతో ఆడియెన్స్ అంత థ్రిల్ ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఫైనల్ గా ఈ సినిమాలో కొన్ని సీన్స్ తప్ప పెద్దగా చెప్పుకునేందుకు ఏది లేదు.

ప్లస్ పాయింట్స్ :

ప్రొడక్షన్ వాల్యూస్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

హీరోయిన్ క్యూట్ లుక్స్

రొటీన్ స్టోరీ

బాటం లైన్ :

లవర్.. ఎప్పటిలానే రొటీన్ డబ్బా..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news