హన్సిక బుట్టలో మరో హీరో

hansika mothwani

చిన్న వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిన హన్సిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందం, అభినయం, అమాయకత్వం అన్ని కలగలిపితే హన్సిక అనడంలో సందేహమే లేదు. ఈ మధ్య ఈ అమ్మడు మీద బాగానే గాసిప్స్ వస్తున్నాయి. తమిళ నటుడు శింబు ప్రేమలో పడినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఆ విషయాన్ని శింబు కూడా ఒప్పుకున్నాడు. అప్పటికే నయనతారతో ప్రేమ వ్యవహారం నడిపిన శింబు..ఆమెతో బ్రేకప్ చేసుకుని హన్సికతో ప్రేమ పాటలు పాడాడు. పెళ్లి దాకా వెళ్తున్న వీళ్ళ లవ్ స్టొరీకి శింబు తండ్రి రాజేంద్రన్ బ్రేక్ వేసారని కోలీవుడ్ లో ఇప్పటికీ ఒక వార్త ప్రచారం లో ఉంది. అయితే ఆ తరువాత వీరి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో ఇద్దరి కథ కంచికి చేరింది.

ఇంతటితో ఆగితే కదా .. మళ్లీ హన్సిక ఓ కుర్ర హీరో ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. అతడు తమిళ హీరో అధర్వ. ఆ మధ్య బాల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పరదేశీ’లో తన నటనతో అదరగొట్టాడు అధర్వ. ఇంతకన్నా చెప్పాలంటే.. తమిళ దివంగత నటుడు మురళీ తనయుడే ఇతడు. హన్సిక ఆధ్వర్య ప్రేమ వ్యవహారం తమిళనాట సినీ రంగంలో పెద్ద సంచలనమే రేపుతోంది.

గతంలో ఈ ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. ఇటీవలే ఈ పెయిర్ తో కొత్త సినిమా స్టార్ట్ అయిపోయింది. అధర్వ చొరవ తీసుకుని హన్సికనే హీరొయిన్ గా ఉండేలా దర్శకుడిని ఒప్పించడాని తెలిసింది. హన్సిక, అధర్వ లవ్ స్టొరీ పీక్స్ లోకి వెళ్ళినందువల్లే ఇప్పుడు కాంబో సినిమాలో కలిసి నటిస్తున్నారని అక్కడి జనం చెవులు కొరుక్కుంటున్నారు.

Leave a comment