బాలయ్యతో ఢీకొడతానంటున్న బాబు..!

50

నందమూరి బాలకృష్ణ ఇటీవల రాజకీయ పరంగా బిజీగా ఉండటంతో ఆయన సినిమాలకు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్నికలు కూడా ముగియడంతో ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో ఈసారి మళ్లీ సీనియర్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య.

బాలయ్య 101వ చిత్రం జైసింహాతో మంచి విజయాన్ని అందించిన తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో మరోసారి బాలయ్యను ఢీకొడతానంటున్నాడు లెజెండ్ విలన్. లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు, మరోసారి బాలయ్యతో ఫైట్‌కు రెడీ అంటున్నాడు. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్యకు పోటీగా జగపతి బాబు పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఏదేమైనా బాలయ్య జగపతి బాబు కాంబో మూవీ మరో లెజెండ్ తరహాలో సూపర్ హిట్‌గా మారడం ఖాయం అని అంటున్నారు చిత్ర విశ్లేషకులు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment